సినిమాల్లోకి రాక‌ముందు `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ ఏం చేసేవాడో తెలిస్తే షాకే!?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ టాప్ హీరోల‌ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగా ఒక‌డు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది కేవ‌లం ఒక్క సినిమానే. ఈ సినిమా ఏంటో తెలుసుగా.. `అర్జున్ రెడ్డి`. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఓవ‌ర్ నైట్ స్టార్ గా మార్చిన సినిమా ఇది. 2017లో విడుద‌లైన ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

తెలుగులో `అర్జున్ రెడ్డి` ఊహించిన దానికంటే ఎక్కువ విజ‌యం సాధించ‌డంతో.. సందీప్ రెడ్డి వంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఆ త‌ర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో `కబీర్ సింగ్` టైటిల్ తో రీమేక్ చేసి.. అక్క‌డ కూడా స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ తో `యానిమ‌ల్‌` అనే మూవీ చేస్తున్నారు. అలాగే ప్ర‌భాస్ తో `స్పిరిట్‌`ను అనౌన్స్ చేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతం స్టార్ హీరోల‌తో వ‌రుస ప్రాజెక్ట్ లు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేసేవాడో తెలిస్తే షాకైపోతారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జ‌న్మించిన సందీప్ రెడ్డి వంగా.. హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలలో ఫిజియోథెరఫీ పూర్తిచేసి.. కొన్నాళ్లు వైజాగ్ లో ఉద్యోగం కూడా చేశాడు. ఆ త‌ర్వాత సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ అఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ ఫై శిక్షణ తీసుకున్నాడు. 2010 నుండి సినిమారంగంలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సందీప్.. ఫైన‌ల్ గా `అర్జున్ రెడ్డి` మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు.

Share post:

Latest