వామ్మో.. సినిమాల కోసం రాజ‌మౌళి ఫ్యామిలీ అన్ని వంద‌ల ఎక‌రాలు అమ్మేశారా?

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. అపజయం ఎరుగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్కార్ ను దక్కించుకునేందుకు అమెరికాలో `ఆర్ఆర్ఆర్‌`ను వేరె లెవ‌ల్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ఒక సినిమా తీశాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అందులో ఇన్వాల్వ్ అవుతుంది.

రాజ‌మౌళి తండ్రి ద‌గ్గ‌ర నుంచి భార్య, కొడుకు, కోడ‌లు, బ్రదర్స్ ఇలా అంద‌రూ ఆయ‌న సినిమా కోసం వ‌ర్క్ చేస్తారు. ప్ర‌స్తుతం అంద‌రూ మంచి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఒక‌ప్పుడు మాత్రం రాజ‌మౌళి ఫ్యామిలీ ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ట‌. సినిమాల కోసం వంద‌ల ఎక‌రాలు అమ్మేశార‌ట‌. సినిమా రంగంలో ఏళ్ల తరబడి నిల‌దొక్కుకోవాలంటే అంత సులభమైన విషయం కాదు. అందుకు బ‌ల‌మైన పునాది ఉండాలి. నిజానికి 300 ఎకరాల్ని రాజమౌళి కుటుంబం కోల్పోయిన తర్వాతే మద్రాసు పరిశ్రమలో నిలదొక్కుకోగలిగారు.

రాజమౌళి పెదనాన్న గారు శివశక్తి దత్తా వల్లనే కోడూరి కుటుంబం మద్రాసు పరిశ్రమకు వెళ్లింది. సినిమాల కోసం మ‌ద్రాసులో సెటిల్ కావ‌డానికి తుంగభద్ర పరిసరాల్లో త‌మ‌కు ఉన్న మూడు వంద‌ల ఎక‌రాల భూమిని అమ్మేశారాయ‌న‌. ఆ త‌ర్వాత బ‌త‌క‌డ‌మే చాలా క‌ష్టంగా మారింద‌ట‌. చివ‌ర‌కు జానకిరాముడు- కొదమ సింహం చిత్రాలతో రచయితగా శివశక్తి దత్తా నిలదొక్కుకోగలిగారు. ఆయ‌న త‌న‌యుడు కీరవాణి అగ్ర సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద పని చేస్తూ కుటుంబ పోష‌ణ‌కు స‌హాయ‌ప‌డేవారు. కొన్నేళ్ల‌కు రాజ‌మౌళి కూడా ద‌ర్శ‌కుడిగా సినిమాల్లో వ‌చ్చారు. ఎన్నో క‌ష్టాలు ప‌డిన త‌ర్వాతే రాజ‌మౌళి ఫ్యామిలీ ప్ర‌స్తుతం ఒక గొప్ప స్థానంలో నిలిచింది. అన్న‌ట్లు రాజ‌మౌళిది జాయింట్ ఫ్యామిలీ. ఇప్ప‌టికీ అంద‌రూ క‌లిసే ఉంటారు. క‌ష్ట‌సుఖాల్లో ఒక‌రికి మ‌రొక‌రు తోడుగా నిలుస్తారు.

Share post:

Latest