మగాళ్లపై ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాటలనేసిందేంటి..!

ఒకప్పటి నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సినిమాలో నటించినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రజ ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి, బుల్లితెరపై కొన్ని షోస్ కి జడ్జిగా వ్యవహారిస్తున్నారు. తాజాగా మగాళ్ల గురించి ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి.

ఇప్పటికి కొన్ని యాడ్స్‌లో ఆడవాళ్లు మగవాళ్లపై ఆధారపడుతున్నారని యాడ్స్ లో చూపిస్తున్నారని ఇంద్రజ చెప్పుకొచ్చారు. కానీ నిజజీవితంలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగానే కాకుండా అంతకు మించి సంపాదిస్తున్నారని ఇంద్రజ పేర్కొన్నారు. కొన్ని చోట్ల మహిళలే మగాళ్లను పోషిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆడవాళ్లు వారి సమస్యలను అర్థం చేసుకోమని మగవాళ్లను పదేపదే అడగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఆమె అన్నారు.

ఆడవారు పర్సనల్ విషయాలను చెప్పుకోవడానికి మొహమాట పడొద్దని, ఈ కాలంలో మహిళలను అర్థం చేసుకునే మగవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఇంద్రజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఆమె నవ్వుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంద్రజ కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

Share post:

Latest