రామ్ చరణ్ బూట్ల ధర తెలిస్తే.. మీ కళ్లు బైర్లు కమ్ముతాయి..

ఏదైనా ఒక పెళ్ళికో లేదా పేరంటానికో వెళ్ళాలి అంటే పాతిక నుంచి ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి. అదే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి అయితే? అసలే ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ అది. అందరి కళ్లూ టాప్ టూ బాటమ్ మన మీదే ఉంటాయి. అలాంటప్పుడు అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో వెళ్ళాలి. ఇంకా బూట్లు విషయాన్ని వస్తే అందరూ వాటి గురించే మాట్లాడుకునేలా ఉండాలి. సెలబ్రిటీలు బూట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొత్తేమీ కాదు.

ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకోడానికి అమెరికా వెళ్లిన చెర్రీ కూడా అదే చేశారు. ఆయన వేసుకున్న బూట్లతో, వాటి రేట్‌తో, అందర్నీ గుండెలు పట్టుకునేలా చేసారు. చరణ్ బూట్లకి పెట్టిన ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంవత్సరం పాటు ఏ బాధ లేకుండా హయ్ గా ఉండొచ్చు. అంటే ఆ బూట్ల ధర ఎంతో అర్థం చేసుకోవచ్చు.

అయితే మెగా పవర్ స్టార్‌ ట్యాగ్‌తో మోస్ట్ ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ డిజైనర్ క్లోత్స్‌లో కనిపించే చెర్రీ వరల్డ్ ప్రెస్టీజియన్ అవార్డ్స్‌ కోసం కూడా దిమ్మతిరిగే రేంజ్లో రెడీ అయ్యారు. తన ఫ్యాషన్ డిజైనర్స్ నిఖితా సింఘానియా, శాంతను డిజైన్ చేసిన సూట్స్‌లో రెడ్ కార్పెట్ పై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మారిపోయారు. ఆయన వేసుకున్న ఔట్ ఫిట్ లో ఎక్కువగా ఆయన షూస్ హాట్ టాపిక్‌ గా మారాయి. ఇక రామ్‌ చరణ్ ఒక్కడే కాదు చాలామంది అత్యంత ఖరీదైన డ్రస్సులు తరించే ఆస్కార్ వేదికగా మెరిశారు. ముఖ్యంగా దీపికా పడుకునే డ్రస్సు అందర్నీ ఆకట్టుకుంది.

Share post:

Latest