తెలుగు హీరోయిన్స్ బిజినెస్ వ్యాపారాలు తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితకాలం ఎంత అని ఎవరమో చెప్పలేము.. నేటితరం హీరోయిన్స్ ముందు చూపుగా ఉంటున్నారు.ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు బిజినెస్ ఉమెన్లుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ ఎవరు..? ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారో చూద్దాం..

Desi Babe: Rakul Preet Singh, Rashmika Mandanna & Keerthy Suresh's hottest  Instagram photos that went viral online | IWMBuzz

1).కాజల్ అగర్వాల్:
టాలీవుడ్ చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ సినిమాలతోనే ఆగిపోలేదు. జువెలరీ బిజినెస్ లోకి ఎంట్రి ఇచ్చింది. మర్సలా అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది.

2).కీర్తి సురేష్:
మహానటి కీర్తిసురేష్ కూడా వ్యాపారం రంగంలో అడుగుపెట్టింది. ఇటు హీరోయిన్ గా సత్తా చాటుతూనే బిజినెస్ ను మైంటైన్ చేస్తోంది. భూమిపుత్ర పేరుతో సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ ను విడుదల చేసింది. ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తమ ప్రొడక్ట్స్ తయారు అవుతుందని కీర్తి సురేష్ తెలుపుతోంది.

3).తమన్నా:
టాలీవుడ్ లో స్టార్ గా చలామణి అయిన తమన్నా స్పీడ్ ప్రస్తుతం కాస్త తగ్గిందని చెప్పవచ్చు. హీరోయిన్గా రాణిస్తున్న టైం లోనే వ్యాపారం లోకి దిగింది. 2015లో జువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.

4).ఇలియానా:
గోవా బ్యూటీ గా పేరుపొందింది ఇలియానా. ప్రస్తుతం ఇల్లీ బేబీకి సినిమాలు పెద్దగా లేవు.. దీంతో బిజినెస్ మొదలు పెట్టింది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయినా గోవాలోనే రెస్టారెంట్ మరియు బేకరీ రన్ చేస్తోంది.

5).రకుల్ ప్రీత్ సింగ్:
తెలుగులో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే ఆఫ్ ది స్క్రీన్ రకుల్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె ఫిట్నెస్.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వర్కు మానుకునేది కాదు రకుల్ ప్రీత్ సింగ్. దాన్ని బిజినెస్ గా మార్చుకుంది. F45fitness health hub అనే పేరుతో జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసింది… వీరే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా బిజినెస్ల్లో ఉన్నారు.

Share post:

Latest