నా భార్య‌కు ఇష్టం లేకున్నా త‌ప్ప‌ట్లేదు.. విడాకుల‌పై ఓపెన్ అయిన శ్రీ‌కాంత్!

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ క‌పుల్స్ లిస్ట్ లో శ్రీ‌కాంత్‌-ఊహా జంట ఒక‌టి. పెళ్లై పాతికేళ్లు అవుతున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచారు. అలాంటి శ్రీ‌కాంత్‌, ఊహా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద‌గా ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లకు ఆల్రెడీ శ్రీ‌కాంత్ పులిస్టాప్ పెట్టాడు. తాజాగా విడాకులపై వార్త‌ల‌పై మ‌రోసారి ఓపెన్ అయ్యాడు.

రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియా వదంతులపై మాట్లాడారు శ్రీకాంత్. `నేను విడాకులు తీసుకున్నట్టు రాశారు. దాంతో అది నిజం కాదు అని చెప్పడానికి నాభార్య ఊహాను వెంట పెట్టుకుని పార్టీలు, ఫంక్షన్స్ కు వెళ్తున్నాను.

తనకు సినిమా ఫంక్షన్స్ అన్నా, పార్టీలు అన్నా ఇష్టం ఉండదు. అయినాస‌రే త‌ప్ప‌ట్లేదు. ఆమె బ్రతిమలాడి తీసుకెళ్ళాల్సి వస్తుంది` అంటూ శ్రీ‌కాంత్ వెల్ల‌డించారు. అలాగే `కొద్ది రోజుల క్రితం నా ఫోటో పెట్టి నేను చనిపోయినట్టు రాశారు. ఇలాంటివి మేము త‌ట్టుకోగ‌ల‌ము. కానీ, మా త‌ల్లిదండ్రులు చూస్తే ఎంతో బాధ‌ప‌డ‌తారు. అస‌లు ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ఎందుకు రాస్తారో కూడా అర్థం కాదు.. వారిపై యాక్షన్ తీసుకుందామన్నా.. ఉపయోగం ఉండదు. వారంతంట వారు మారాలి` అంటూ రూమ‌ర్స్ సృష్టించేవారిపై చిరు కోపం వ్య‌క్తం చేశారు.

Share post:

Latest