ఇస్మార్ట్ శంకర్-2 చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!

టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారని చెప్పవచ్చు. గతంలో ఎంతోమంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చారు. ఎన్నో సినిమాలు ఫ్లాపుల తర్వాత రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయం అందుకోవడంతో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి టైగర్ సినిమాను తీసి ఘోరమైన డిజాస్టర్ ని చవిచూశారు.

Ram, Puri Jagannadh 'iSmart Shankar' Launched

ఈ సినిమా నుంచి కోలుకోలేని దెబ్బ పడటంతో ప్రేక్షకుల ముందుకు రావాలని పూరి జగన్నాథ్ ఎంత ట్రై చేస్తున్న రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ రామ్ తో కలిసి బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా చిరంజీవితో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్టు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇక తర్వాత బాలయ్యను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆయన కూడా నో చెప్పినట్లుగా సమాచారం. ఈ క్రమంలోని తన చిత్రం కోసం రామ్ పోతినేనినీ కలిసినట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ జోడి హిట్ కావడంతో మరొకసారి రామ్ తోనే సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు పూరి జగన్నాథ్ అయితే కథ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది.ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్,పూరి సినిమా త్వరలోనే ప్రారంభమై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest