నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి.. పెళ్లిపై స్పందించిన నరేష్..

గత రెండు రోజుల నుంచి నరేష్ – పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది..కొంతమంది అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు అని.. సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను నరేష్ మళ్ళీ పోస్ట్ చేశాడు అంటూ తెగ కామెంట్లు చేస్తారు.. మరి కొంతమంది ఏకంగా పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తూ కథనాలు అల్లారు. వాస్తవానికి నరేష్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మాత్రం మిస్టరీగానే మారింది.. అయితే మరి కొంతమంది మాత్రం ఈ పెళ్లి అంతా ప్రమోషన్స్ స్టంట్ అంటూ చెప్పుకొస్తున్నారు..

Naresh, Pavitra Lokesh marry in intimate wedding ceremony. Watch -  Hindustan Times

అయితే ఇలా అనడానికి కూడా కారణం లేకపోలేదు.. ఎందుకంటే నరేష్ నటించిన ఇంటింటి రామాయణం అనే వెబ్ సిరీస్ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానిపై హైప్ పెంచడానికి నరేష్ ఇలాంటి పని చేసి ఉండవచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై క్లారిటీగా తెలుసుకోవడానికి మీడియా నరేష్ వెంటపడింది. ఆయన ఉన్న చోటు కల్లా వెళ్లి పెళ్లి గురించి అడగడం మొదలుపెట్టింది మీడియా. ఇలా గుంపులు గుంపులుగా మీడియా తన వెంట పడడం చూసిన నరేష్ వెంటనే తన కారు దగ్గరకు వెళ్లిపోయారు. కోపంగా.. నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి.. నా పెళ్లి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్ని విషయాలు చెబుతాను ..అప్పటివరకు ఓపిక పట్టండి.. అంటూ చెప్పుకొచ్చారు.

నరేష్ మాటలకు నటిజెన్లు బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అసలు నీ పెళ్లి ఏంటో.. ? అది జరగడమే పెద్ద గొప్ప అంటుంటే మళ్ళీ నువ్వు దాన్ని ప్రమోషన్స్ కింద వాడుకోవడం మరొక ఎత్తు అంటే కామెంట్లు చేస్తున్నారు.. మరి నరేష్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడు..? ఒకవేళ మీట్ పెట్టి ఎలాంటి కామెంట్లు చేస్తారు ?అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Share post:

Latest