ఫేక్ ఓట్ల పంచాయితీ..వైసీపీ ఎత్తులు.!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన దొంగ ఓట్ల కలకలం రేగుతుంది. ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఈ దొంగ ఓట్ల అంశం వచ్చేది..కానీ ఇప్పుడు ప్రటోచోట దొంగ ఓట్ల అంశం వస్తూనే ఉంది. ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా అధికార వైసీపీ ఈ పనికి పాల్పడుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అధికార బలం, ప్రలోభాలకు గురి చేస్తుందని, అయినా సరే గెలవమనే నమ్మకంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారని టి‌డి‌పి-కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.

ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ-టి‌డి‌పి-పి‌డి‌ఎఫ్ పార్టీల మధ్య పోరు నాదుస్తోంది. అయితే వైసీపీకి ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. పైగా పట్టభద్రుల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవకపోతే పార్టీకి డ్యామేజ్ అనే ఉద్దేశంతో..వైసీపీ తన అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి గెలవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ ఓట్లని సృష్టిస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు రావడమే కాదు..టి‌డి‌పి-పి‌డి‌ఎఫ్ కలిసి ఫేక్ ఓట్లని పెద్ద ఎత్తున ఆధారాలతో సహ బయటపెడుతున్నారు.

ఒక ఇంట్లో పదుల శాంఖ్యలో పట్టభద్రుల ఓట్లు ఉండటం..ఒక వ్యక్తికి పది ఓట్లు పైనే ఉండటం..ఇప్పుడు ఇలా ఒకటి నానా రకాల విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,11,653 పట్టభద్రుల ఓటర్లు ఉంటే..అందులో 8వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలోని 50 డివిజన్లలో డివిజన్‌కు 200 చొప్పున ఫేక్‌ ఓటర్లను చేర్చాలని కేడర్‌కు టార్గెట్‌ పెట్టి దాదాపు 10వేల దొంగ ఓట్లను జాబితాలోకి ఎక్కించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక వీటిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండటం లేదని, వారు వైసీపీతో కుమ్మక్కు అయ్యారని, దీంతో వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఎన్నికల్లో గెలుపుని ఈ ఫేక్ ఓట్లు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.