చిరంజీవి సురేఖ కంటే ముందు ప్రేమించిన యువతి ఎవరో తెలుసా..

ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ కంటే టాలెంట్ ఉంటేనే మంచిగా రాణిస్తుంటారు. అలా తన సొంత కష్టం, టాలెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని చిన్న చిన్న పాత్రలలో నటించాడు. విలన్‌గా నటిస్తూనే తన టాలెంట్ తో హీరోగా అవకాశం దక్కించుకొని మెగాస్టార్ గా ఏదిగాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవి టాలెంట్, వ్యక్తిత్వం చూసి అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖని ఇచ్చి వివాహం చేసారు.

చిరంజీవి ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్బంగా వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి తన మొదటి లవ్ ఫెయిల్యూర్ గురించి వివరించారు. అయితే చిరంజీవి నోటి నుంచి లవ్ అనే పదం వినగానే సురేఖనే ఇంకెవరు ఉంటారు అతని లైఫ్ లో అని అందరూ అనుకుంటారు. అలా మీరు కూడా అనుకోని ఉంటే మీరు పప్పులో కాలేసిన్నట్లే.

చిరంజీవి 7వ తరగతి చదివేటప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడారట. ఆ అమ్మాయి చిరంజీవికి రోజు సైకిల్ నేర్పించేదట. ఆ సమయంలో ఆ అమ్మాయిని చిరు ఎంతో ప్రేమించారట. అయితే వయసు పెరిగే కొద్దీ అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ మాత్రమే అని తెలుసుకొని వదిలేసారట. ఇక ఈ విషయం గురించి ఆయన భార్య సురేఖకి కూడా చెప్పారట చిరు. ఈ విషయం తెలిసి చిరు కూడా లవ్ ఫెయిల్యూరేనా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest