తన విడాకులపై స్పందించిన డైరెక్టర్ సెల్వ రాఘవన్..!!

సినీ ఇండస్ట్రీలో కానీ, సామాన్య కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న కారణాలవల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారు చాలామంది. అయితే సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సెలబ్రిటీల విడాకులు అంటే చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరినొకరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

Sonia Agarwal Opens Up About Her Ex-Husband Selvaraghavan! | Astro Ulagam
ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి 2006లో వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం అన్యోన్యంగా సాగిన వీరి జీవితం కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై సెల్వ రాఘవన్ మాట్లాడడం జరిగింది. ఇటీవల తమిళ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్వ రాఘవన్ మాట్లాడుతూ విడాకుల తీసుకున్న తర్వాత తాను మానసిక క్షోభకు గురయ్యానని.. ఆ సమయంలో తన తమ్ముడు ధనుష్ ఒక్క మాట చెప్పారని తెలిపారు. ధనుష్ తన అన్నయ్యతో ఇలా మాట్లాడుతూ.. దీని గురించి త్వరగా బయటపడు దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు అప్పటివరకు ఒంటరిగానే ఉండు అని చెప్పారట.

Director Selvaraghavan's Love Story with Second Wife Revealed! | Astro  Ulagam
ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకు గీతాంజలి వచ్చింది ఆమె వెళ్లే నా జీవితంలో ఇలా మార్పులు చోటు చేసుకున్నాయి.దీంతో ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామంటూ చెప్పుకోచ్చారు సెల్వ రాఘవన్. అయితే గీతాంజలితో మాత్రం 2011లో రెండో వివాహం జరిగింది. మరొకవైపు సోనియా కూడా ఇప్పటికి ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తుంది పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest