రాజకీయాల ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దిల్ రాజ్ కుమార్తె హన్షిత రెడ్డి, అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కలసి బలగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకు ఆదరణ బాగా లభించింది. అలాగే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్ల ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది.ఈ వేడుకకు రాష్ట్రమంత్రి సీఎం తనయుడు కల్వకుంట్ల తారక రామారావును ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.

I know who is creating a controversy around Varasudu: Dil Raju

ఈ వేడుకలో కేటీఆర్ ,కేసీఆర్ ల పై దిల్ రాజు ప్రశంశాలు కురిపించారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈవెంట్ను హైదరాబాదులో కాకుండా సిరిసిల్లలు నిర్వహించడం కేటీఆర్ ను పోవడంతో రాజకీయాల్లోకి రావడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని వార్తలకు బలంగా మారిపోయింది. అంతేకాక దిల్ రాజు ఆయన సొంత ఊరిలోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని గుడిని కట్టిస్తున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ప్రశంశాలు అందుకుంటూ ఉన్నారు.

ఇవన్నీ చూస్తూ ఉంటే దిల్ రాజు రాజకీయాలలో ఎంట్రీ ఇస్తూ పోతున్నారని అందరూ అనుకున్నారు. గతంలో కూడా సినీ ఇండస్ట్రీలోని కొంతమంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై దిల్ రాజు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.. దిల్ రాజు మాట్లాడుతూ నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు రాశారు నాకు ఆసక్తి ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు కదా! మా పెద్దన్నయ్య కోడలి పుట్టింటి వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆంధ్రాలో ఉన్నారు.మా చిన్న అన్నయ్య కూతురు వాళ్ళు తెలంగాణలో ఎమ్మెల్యేలు మా బంధువులు రాజకీయ నాయకులు ఉన్నారు.. కానీ నా రాజకీయ ప్రవేశం గురించి నాకు తెలియదు కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు దిల్ రాజు.

Share post:

Latest