పఠాన్ వివాదంపై మొదటిసారి స్పందించిన దీపిక..?

పఠాన్ చిత్రంలో బేశారమ్ సాంగ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాలలో సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.సోషల్ మీడియాలో ఒక వార్ మొదలయిందని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా ఈ పాట పెద్ద దుమారాన్ని రేపింది. ముఖ్యంగా దీపికా పడుకొనే ఈ పాటలో బికినీ రంగు పైన భాజపానేతలు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు దీపికాకు అండగా నిలబడడం వంటి సన్నివేశాలు కూడా కాక పుట్టించాయి. ఇక ఈ సినిమా విడుదల వరకు కాస్త చర్చనీయంశంగా మారింది. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు దీపికకు సైతం మద్దతుగా నిలబడడం జరిగింది.

Shah Rukh Khan lauds Deepika Padukone for Besharam Rang despite controversy  | Bollywood - Hindustan Times
దీపిక ఈ విషయం పైన ఎక్కడ కూడా స్పందించలేదు. సోషల్ మీడియా కామెంట్లను అసలు పట్టించుకోలేదు . కేవలం తన తప్పేముంది అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటుంది. సీన్ డిమాండ్ చేయడంతో నటించానని ఆ వైఖరిని మౌనంగానే ప్రదర్శించింది ఈ ముద్దుగుమ్మ ఇక విడుదల తర్వాత పఠాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ కి కొత్త ఊపిరి పోసిందని చెప్పవచ్చు. దాదాపుగా ఈ సినిమా రూ.1000 కోట్ల రూపాయల కలెక్షన్లను ఆదుకుంది .తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ బేశారమ్ సాంగ్ వివాదం పైన తనదైన స్టైల్ లో స్పందించినట్లుగా తెలుస్తోంది.

నేను క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాను.. కాలేజీ రోజులను వరకు నేను పెద్ద క్రీడాకారిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంక్షోభం నైనా ఎదుర్కొని ధైర్యం క్రీడలు కల్పిస్తాయి.. అందుకే పఠాన్ వివాద సమయంలో నేను స్పందించలేదని తెలిపింది. ఈ ఘటన నన్ను ఎక్కడ కదిలించలేదు. షారుక్ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లని ఎన్నో కలలతో ఫ్యాన్స్ తో ఈ రంగంలోకి వచ్చాము. ఆ స్థాయి నుంచి వచ్చిన వారు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడగలరని తెలిపింది. ఈ రంగంలో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అవన్నీ జర్నీలో ఒక భాగమే అప్పుడే ముందుకెళ్లగలము అంటూ తెలియజేసింది.

Share post:

Latest