గంటా సీటుపై కన్ఫ్యూజన్..అక్కడ ఓటమే?

నెక్స్ట్ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేసే సీటు ఏది? ప్రతిసారి నియోజకవర్గం మార్చే ఆయన ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన టి‌డి‌పిలోనే కొనసాగే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ పార్టీలోనే ఉంటారు. అయితే ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు గంటా అనకాపల్లి ఎంపీగా ఒకసారి..చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.

ప్రస్తుతానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆయనకు పెద్ద పాజిటివ్ లేదు. గత ఏన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గానికి అందుబాటులో లేరు. దీంతో అక్కడ గంటాకు యాంటీ ఉంది. నెక్స్ట్ ఏన్నికల్లో ఇక్కడ బరిలో ఉంటే ఓటమి ఖాయమే అని సర్వేలు చెబుతున్నాయి. అయితే పోటీ చేసిన సీటులో మళ్ళీ పోటీ చేయడం గంటాకు అలవాటు లేని పని..అలాంటప్పుడు ఆయన ఏ సీటులోకి వెళ్తారనేది క్లారిటీ లేదు. విశాఖ నార్త్ నుంచి మాత్రం పోటీ చేయడం జరిగే పని కాదని తెలుస్తోంది.

ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటు టి‌డి‌పి వదులుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు గంటా మళ్ళీ భీమిలికి వెళ్ళే ఛాన్స్ ఉందా? అనేది డౌట్ గానే ఉంది. అక్కడ టి‌డి‌పి ఇంచార్జ్ ఉన్నారు. ఇటు చోడవరం, అనకాపల్లిలో అదే పరిస్తితి. ఇక గంటా కోసం త్యాగం చేయడానికి కూడా ఎవరు రెడీగా లేరు. మరి ఇవేమీ కాకుండా కొత్త సీటులో గంటా పోటీ చేస్తారా? అనేది చూడాలి.