బుచ్చయ్యకు జనసేనతో రిస్క్ తప్పదా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. రాజమండ్రి సిటీ గాని, రాజమండ్రి రూరల్ గాని టి‌డి‌పికి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో సైతం..రెండు చోట్ల టి‌డి‌పి విజయం సాదించింది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరీ గెలిచారు. అయితే ఇప్పటికీ రెండు చోట్ల టి‌డి‌పి బలంగానే ఉంది. మరోసారి సిటీలో టి‌డి‌పి గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రూరల్ లోనే కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి.

అది కూడా వైసీపీతో కాదు జనసేనతో. ఇక్కడ జనసేన బలం పెరిగిందని తాజా సర్వేలు అంచనా వేస్తున్నాయి. తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో రాజమండ్రి రూరల్ లో జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరీ ఉన్నారు. ఈయన మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ జనసేనతో ఆయనకు రిస్క్ ఉందని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో బుచ్చయ్య వైసీపీపై 10 వేల ఓట్ల మెజారిటీపైనే గెలిచారు. ఇక్కడ బుచ్చయ్యకు 74 ఓట్ల వరకు రాగా, వైసీపీకి 63 వేల ఓట్ల చిల్లర వచ్చింది. ఇటు జనసేనకు 42 వేల ఓట్లు వచ్చాయి. అంటే అప్పుడే జనసేనకు భారీగా ఓట్లు పడ్డాయి. అయితే ఈ ఓటు బ్యాంకు మరింత పెరిగిందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాకపోతే టి‌డి‌పి-జనసేన గాని పొత్తులో పోటీ ఎలాంటి ఇబ్బంది లేదు..కానీ విడిగా పోటీ చేస్తే మాత్రం బుచ్చయ్యకు రిస్క్ ఎక్కువ. ఏ మాత్రం తేడా వచ్చిన ఆయన ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest