ప్రముఖ నటిని చితకబాదిన ప్రియుడు… చావు దెబ్బలు చూపించుకొని లబోదిబో!!

సాధారణ అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు ప్రేముకుడి వల్ల వేధింపులకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ మధ్యే ప్రియుడి చేతులో హతమైన శ్రద్ద వాకర్ నుండి అలాంటి ప్రియుడి చేతనే దెబ్బలు తిన్న హీరోయిన్ ఫ్లోరా సైనీలే వీటికి లివింగ్ ప్రూఫ్స్. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు ప్రేక్షకు పరిచయమైన ఆశా తన బాయ్ ఫ్రెండ్ చేతిలో చిక్కి చావు అంచులవరకు వెళ్ళింది ఈ విషయాన్ని తానే స్వయంగా మీడియాతో చెప్పింది.

తాజాగా ఇంకో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ చేతిలో హింసకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలు పెడుతున్నాడు అంటూ తమిళ నటి అనిఖా విక్రమన్ సోషల్ మీడియా వేదిక నోరు విప్పింది. అంతేకాకుండా వారి రిలేషన్ కు సంబంధించిన కొన్ని అనుభవాలను షేర్ చేస్తూ కుమిలిపోయింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో కొన్ని ఫోటోలు, నోట్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో అనిఖా ముఖం కమిలిపోయి, శరీరం అంతా గాయాలతో ఉంది. ఆ ఫోటోలను అనిఖా షేర్ చేస్తూ తనకి తన కుటుంబానికి ఆమె బాయ్ ఫ్రెండ్ వల్ల ప్రాణహాని ఉందని తెలిపింది.

అనిఖా రాసిన నోట్ లో ‘గతంలో అనూప్ పిలై అనే వ్యక్తి తో రిలేషన్ లో ఉన్నాను. ఆ రిలేషన్ నాకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అనూప్ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. అలాంటి మనిషినీ నేను ఎక్కడా చూడలేదు. అసలు నా జీవితం ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంతలా నన్ను ఇబంది పెట్టిన అతని మనసు మారలేదు. ఇప్పటికి కూడా అతని వల్ల నేను ఇబ్బంధులు పడుతునే ఉన్నాను ‘ అని పేర్కొంది.

 

అనిఖా ఇంకో పోస్ట్ లో ‘ మొదటి సారి అతను నన్ను కొట్టినప్పుడు, కొతసేపటికి నా కాలమీద పడి క్షమాపణ చెప్పాడు. దాంతో నేను ఏమి అనలేదు. ఆ తరువాత ఇంకోసారి అదే రిపీట్ అయింది. ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టాడు. వెంటనే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. కానీ అతను పోలీసులకు డబ్బు ఆశ చూప్పించి అతని వైపుకు తిప్పుకున్నాడు. మేము రిలేషన్ లో ఉన్నపుడు తరచు నా ఫోన్ చెక్ చేసేవాడు. ఒకరోజు నన్ను బాగా కొట్టి తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోడానికి వెళ్ళాడు. నేను దెబ్బలు భరించలేక ఏడుస్తుంటే డ్రామా బాగా చేస్తున్నావ్ అంటూ హేళన చేస్తు నవ్వేవాడు ‘అంటూ ఆమె మనసులో ఉన్న బాధ బయటపెట్టింది.

Share post:

Latest