మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య పెద్ద గొడవలు.. అసలు మేటర్ ఏంటంటే..

మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అయితే వారిద్దరికీ ఇది రెండో వివాహమే. ఇంతకుముందు మౌనిక రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కొడుకును కన్నది. ఆ కొడుకుని మనోజ్ తన సొంత కొడుకుల భావిస్తానని అధికారికంగా ప్రకటించి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇక తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోస్ లో మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ ఉన్నారు ఒక విష్ణు తప్ప. మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహానికి మంచు విష్ణు హాజరయ్యారు.

కానీ మిగిలిన కార్యక్రమాలన్నిటిలో దూరం దూరంగా ఉన్నాడు. అయితే మంచు విష్ణు అలా దూరంగా ఎందుకు ఉన్నాడనే దాని గురించి సోషల్ మీడియా లో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. అన్నదమ్ములిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే మంచు మనోజ్ పెళ్ళిలో మంచు విష్ణు అంటి ముట్టనట్లు ప్రవర్తించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ విషయం ఏ మాత్రం నిజం కాదని ఇప్పటి వరకు మోహన్ బాబు ఆస్తికి సంబంధించిన పంపకాలు ఏమీ చేయలేదని, విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా వారి సొంత సంపాదన తోనే జీవితాన్ని హాయిగా సాగిస్తున్నారని మంచు ఫ్యామిలీ కి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.

మంచు ఫ్యామిలీ అంటే గిట్టని వారు కొందరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు.మంచు విష్ణు పెళ్లికి హాజరయ్యారు, కానీ కొన్ని కారణాల వల్ల కాస్త దూరంగా ఉండి ఉంటారు అంతే తప్పితే ఆస్తి తగాదాలు అయితే ఏమి ఉండక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు ముందు అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. ఇప్పటికయినా ఇద్దరు ఒక సారి కలిస్తే పుకార్లన్నింటికి చెక్ పెట్టే అవకాశం ఉంది.

Share post:

Latest