శ్రీలీల కోసం బాలయ్య పెద్ద ఫైట్.. ఎందుకంటే..

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని మంచి విజయం అందుకున్నాయి. దాంతో ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గ్రాఫ్ బాగా పెరిగింది. మొదట చిన్న హీరోలతో మొదలు పెట్టిన అనిల్ ప్రస్తుతం మహేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీసే అవకాశాలు దక్కించుకున్నాడు.

గత ఏడాది f3 సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తో సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకూ పూర్తయింది. మిగితా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా నుంచి ఒక అప్‌డేట్ బయటకు వచ్చింది. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.

ప్రెజెంట్ షెడ్యూల్ లో బాలయ్య, శ్రీలీల మీదనే కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం కిడ్నాప్ కు గురి అయిన శ్రీలీలను సేవ్ చేయడానికి బాలయ్య చేసే ఫైట్స్ చాలా కఠినంగా ఉన్నాయట. చూడాలి మరి వీరి మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ ఎలా అలరిస్తుందో. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి అనిల్ బాలయ్యకు కూడా భారీ హిట్ అందిస్తాడో లేదో వేచి ఉండాల్సిందే.

Share post:

Latest