రీ రిలీజ్ కు సిద్ధమైన బాలయ్య సింహా చిత్రం.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోస్ డైరెక్టర్ కెరీర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే మహేష్, పవన్ ,చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ ,ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా పేరుపొందిన సినిమాలను థియేటర్లో రీ రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ చేసి భారీగా కలెక్షన్లు రాబట్టింది.

Date locked for Balayya's mass roar on big screens | 123telugu.com
ఇప్పుడు తాజాగా మరొక సినిమాతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమయ్యారు బాలయ్య. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం సింహ. ఈ సినిమా మార్చి 11న మరొకసారి థియేటర్లో రి రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నయనతార స్నేహ ఉల్లాల్ నటించింది. అలాగే నమిత కూడా నటించడం జరిగింది. 2010లో తెలుగు సినీ పరిశ్రమలు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో సింహ కూడా ఒకటి.

Watch Simha Full Movie Online in HD Quality | Download Now
ప్రస్తుతం బాలకృష్ణ ,డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును అనౌన్స్మెంట్ చేశారు కొద్ది రోజులుగా ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం ఇందులో బాలయ్య కూతురుగా శ్రీ లీల నటించబోతోంది. మరి బాలయ్య సింహా సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి మరి.

Share post:

Latest