పాపం.. అంద‌మైన అనుష్క‌కు అలాంటి వ్యాధి ఉందా?

అతి త‌క్కువ స‌మ‌యంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అనుష్క శెట్టి.. ఇటీవ‌ల కాలంలో సినిమాలు చేయ‌డంలో మునుప‌టి జోరును చూపించ‌లేక‌పోతోంది. ఈ అమ్మ‌డు వెండితెర‌పై క‌నిపించి చాలా కాలం అయిపోతోంది. ప్ర‌స్తుతం యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేస్తోంది.

అదే `మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టి`. పి. మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వ‌రలోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక‌పోతే ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా కనిపించిన అనుష్క.. ఈ మ‌ధ్య కాలంలో బాగా బ‌రువు పెరిగిపోయింది. గుర్తు కూడా పట్టనంతగా మారిపోయింది అనుష్క.

మ‌ధ్య‌లో కొద్ది రోజులు కాస్త స‌న్న‌బ‌డినా.. మ‌ళ్లీ రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటోల్లో బొద్దుగా క‌నిపించి షాకిచ్చింది. యోగా టీచర్ అయ్యుండి కూడా వెయిట్ ఎందుకు తగ్గలేకపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. అయితే అంద‌మైన అనుష్క గ‌త కొన్నేళ్ల నుంచి థైరాయిడ్ వ్యాధితో బాధ‌ప‌డుతుంద‌ట‌. అందుకే ఎంత ప్ర‌య‌త్నించినా వెయిట్ పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ఓవైపు వెయిట్ ను మ‌రోవైపు థైరాయిడ్ ను కంట్రోల్ చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డుతుంద‌ని స‌మాచారం.

Share post:

Latest