ఆ ఒక్క త‌ప్పుతో కెరీర్ ను నాశ‌నం చేసుకుంటున్న అనుప‌మ‌.. ఫ్యాన్స్ వ‌ర్రీ!?

గత కొన్ని నెలల నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌.. గత ఏడాది అదరగొట్టేసింది. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని దుమ్ము దుమారం రేపింది. దీంతో అనుపమ స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్లతో చక్రం తిప్పుతుందని అందరూ భావించారు.

కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ మలయాల కుట్టి తెలుగులో `డీజే టిల్లు స్క్వేర్‌` చిత్రంలో చేస్తోంది. ఈ ప్రాజెక్టు మినహా మరో సినిమా అనుపమ చేతిలో లేదు. అయితే గత ఏడాది వరుసగా హిట్స్ పడడంతో అనుపమ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట. తాను అడిగినంత ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానని చెబుతుందట. దీంతో దర్శక నిర్మాతలు చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారట.

ఈ కారణంగానే అనుపమకు ఇప్పుడు ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయ‌ని అంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో మొండిగా వ్యవహరించి అనుపమ తప్పు చేస్తుందని.. చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటుందని ఇన్‌సైడ్ టాక్‌ నడుస్తోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా వ‌ర్రీ అవుతున్నారు. మరి ఇప్పటికైనా అనుపమ కెరీర్ విషయంలో ముందు జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి.

Share post:

Latest