సినిమాలపై సన్సేషనల్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

చాలా మంది నటీనటులు తమ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీకి దూరం అయిన వాళ్లలో హీరోయిన్ భానుశ్రీ మెహ్రా కూడా ఒకరు. 2010లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన వరుడు సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన భానుశ్రీ మెహ్ర తన కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరుడు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ ముఖం చూపించకుండా సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. దాని వల్ల హీరోయిన్ పై, సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేసి బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది ఈ చిత్రం. దాంతో భానుశ్రీకి ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. చిన్న సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ గుర్తింపు మాత్రం రాలేదు. ఇండస్ట్రీలో ఎదగాలనుకున్న భానుశ్రీ కోరిక కోరికగానే మిగిలిపోయింది.

వరుడు సినిమా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మడు యూట్యూబర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుడు సినిమా హీరోయిన్ ట్యాగ్‌ను తుడిచివేయడానికి ఎదురుచూస్తోంది. భానుశ్రీ మెహ్రా తన సోషల్ మీడియా పేజీలలో కొత్తగా యూట్యూబ్ ప్రారంభించినట్లు రాశారు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్‌గా “నా సినిమా కెరీర్ కంటే నా యూట్యూబ్ వీడియోలు మరింత వినోదాత్మకంగా ఉన్నాయని నేను హామీ ఇస్తున్నాను!”, అంటూ రాసుకొచ్చింది.

ప్రతి ఒక్కరి ఆమె ఛానెల్ ని సబ్‌స్క్రయిబ్ చేయమని అడుగుతుంది భానుశ్రీ. ఇక సినిమాల్లో భాను కనిపించని చాలామంది ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. కొందరు ఫైర్ అవుతున్నారు. అసలయితే యూట్యూబ్‌లో సక్సెస్ కావాలంటే ఎక్కువగా వైరల్ వీడియోలు చేయాలి. లేదంటే వారి వీడియోలలో ఒకటి వైరల్ కావాలి. కేవలం సబ్‌స్క్రయిబర్స్ ని పెంచుకుంటే మాత్రం సరిపోదు. కనీసం యూట్యూబ్ ద్వారా అయిన భానుశ్రీ గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో చూడాలి మరి.

Share post:

Latest