అలాంటి బిజినెస్ మొదలుపెట్టిన అల్లరి నరేష్ హీరోయిన్.. అవకాశాలు రాకే ఈ పని??

రిచా పనయ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె మొదట అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. చందమామ కథలు (2014) సినిమాలో ముస్లిం అమ్మాయి హసీనా పాత్రలో రిచా బాగా నటించి ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రాలేదు. ఈడు గోల్డ్ ఎహే, రక్షక భటుడు లాంటి సినిమాలలో నటించినప్పటికీ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. లాక్‌డౌన్ సమయంలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ మాయమైంది.

ఇక తాజాగా హైదరాబాద్‌లో మెరిసిందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కరోనా లాక్‌డౌన్‌లో నేను రెండు సినిమాలు చేశాను. అవి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను. అందులో ఒకటి శ్రీధర్ సీపానగారి దర్శకత్వం వహించిన ‘బృందావనమది అందరిది’, రెండోది నీలకంఠ గారి దర్శకత్వం వహించిన సినిమా. అవి విడుదలైన తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని నేను భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

అప్పటి షూటింగ్ రోజులను మిస్ అవుతున్నాను. ఆ రోజులు నాకు ఎంతో మొమరబుల్ డేస్. కానీ సినిమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పలేం. అందుకే ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నాను. ఒక క్యాట్ కాఫీ స్టూడియోని స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ చూసుకుంటున్నాను. నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది. అయితే సినిమాలలో మంచి అవకాశాలు వస్తే మాత్రం అసలు వదులుకోను” అని చెప్పుకొచ్చింది.

అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం విషయం గురించి మాట్లాడుతూ ‘ ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. అందులో నెగిటివిటి బాగా పెరిగిపోయింది. నేను కామెంట్స్ పెద్దగా చూడను, చదవను. ఏదైనా బ్యాడ్ కామెంట్ ఉంటే డిలీట్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటే బాగుంటుంది. కానీ మా అమ్మ మాత్రం అన్ని కామెంట్స్‌ను చదువుతూ ఉంటుంది ‘అని తెలిపింది రిచా పనయ్. తన పెళ్లి గురించి స్పందిస్తూ నెక్స్ట్ ఇయర్ ఉండవచ్చని తెలిపింది.