ఆహాకు కొత్త సీఈవో.. దానికోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ హవా నడుస్తోంది. చాలా మంది సినీ ప్రేమికులు థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడకుండా ఓటీటీలోనే చూస్తున్నారు. ఇక ఓటీటీ సంస్థలో ఒకటైనా ఆహా వచ్చే మూడేళ్లలలో ఒరిజినల్ కంటెంట్ రూపొందించి దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ పెట్టుబడిలో దాదాపు 20%-30% వరకు సినిమాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగించబడుతుందని తెలిపింది.

మిగిలిన 70%-80% పెట్టుబడి కొత్త కంటెంట్ కోసం ఉపయోగిసస్తారని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ తెలిపారు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆహా ఇటీవలే తమిళ ప్రేక్షకులను అల్లరిస్తుంది. రాబోయే రోజుల్లో ఇతర భాషల్లోకి ఈ ఓటీటీ సంస్థ ప్రవేశించనుంది. అలాగే కొత్త జానర్ లో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆహా తన కార్యనిర్వాహక బృందంలోనూ కొన్ని మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు కొత్త సీ.ఈ.ఓ వచ్చారు. అంతకుముందు సీఈవోగా ఉన్న అజిత్ ఠాకూర్ ఇక నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపింది. ఆయన ఆధ్వర్యంలో ఆహా స్టూడియోస్ భవిష్యత్‌లో జరిగే అన్ని కార్యక్రమాల రూపకల్పన చేయనుంది.

అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్త రవికాంత్ సబ్నవీస్ ను ఆహా కొత్త సీఈఓగా నియమించింది. ప్రస్తుతం ఆహా తెలుగు డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆహా నాన్ ఫిక్షన్ చిత్రాలు, రియాలిటీ షోస్ ఎక్కువగా చేశామని, వాటిలో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే అత్యంత విజయంతమైన టాక్ షోలలో ఒకటిగా ఉందని తెలిపారు. అలాగే ఒరిజినల్స్‌ రూపొందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు అజిత్ ఠాకూర్. ఆహా ఓటీటీ సినీ ప్రియులు కోరుకునే విధంగా వెబ్ సిరీస్ నుంచి గెమ్ షోస్ వరకు ప్రతి దానిలో మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తామని కొత్త సీఈఓ రవికాంత్ తెలిపారు.