అదే మైన‌స్‌.. అందుకే పెద్ద హీరోల‌తో న‌టించ‌లేదు: యమున

సీనియర్ న‌టి య‌మున గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో యాభైకి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించింది. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఓ వ్య‌భిచార కేసులో య‌మున ప‌ట్టుబ‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వార్త‌లు ఆమెపై చాలా ప్ర‌భావాన్నే చూపించింది. అప్ప‌టి నుంచి ఆమె కెరీర్ డౌన్ అవుతూ వ‌చ్చింది. హీరోయిన్ గా ఆఫ‌ర్లు త‌గ్గిన త‌ర్వాత బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి సీరియ‌ల్స్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అలాగే టీవీ షోస్‌లో మెరుస్తోంది. ఇక‌పోతే త‌న కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఒక్క పెద్ద హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేక‌పోయింది.

అందుకు గ‌త కార‌ణాన్ని తాజా ఇంట‌ర్వ్యూలో య‌మున తెలిపింది. `నేను పెద్ద హీరోల సరసన చేయకపోవడానికి కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. అయితే ఎమోషనల్ రోల్స్ ఎక్కువగా చేయడం, గ్లామరస్ పాత్రలు చేయకపోవడం అందుకు కారణమై ఉంటుందని అనుకుంటున్నాను. డీ గ్లామర్ రోల్స్ కి యమున బాగుంటుందనే ఇమేజ్ రావడం నాకు మైనస్ అయింది. అందుకే పెద్ద హీరోల‌తో న‌టించ‌లేక‌పోయా` అంటూ య‌మున చెప్పుకొచ్చింది.

Share post:

Latest