పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అంజ‌లి.. రాజోలు బ్యూటీకి వ‌రుడు దొరికేశాడోచ్‌!?

హీరోయిన్ అంజ‌లి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజ‌లి.. మొద‌ట కోలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ వంటి చిత్రాలు ఆమెకు ఇక్కడ పాపులారిటీ తీసుకొచ్చాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న `ఆర్సీ 15`లో ఒక హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే త‌మిళంలోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అంజ‌లికి సంబంధించి ఓ క్రేజీ వార్త తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఈ రాజోలు బ్యూటీ పెళ్లి పీట‌లెక్క‌బోతోందట‌.

అంజలి తల్లిదండ్రులు మంచి అబ్బాయిని చూసి కూతురుకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట. ఇందులో భాగంగానే ఓ వ్యాపార‌వేత్త‌ను వ‌రుడిగా ఎంపిక చేశార‌ట. అంజ‌లికి కూడా స‌ద‌రు వ్య‌క్తి న‌చ్చ‌డంతో.. ఇరుకుటుంబ‌స‌భ్యులు చ‌ర్చ‌లు జ‌రుపుకుంటున్నార‌ట‌. ఇక `ఆర్సీ 15` విడుద‌లైన వెంట‌నే అంజ‌లి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని నెట్టింట జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

Share post:

Latest