నటుడు సంపూర్ణేష్ బాబు సైలెంట్ గా ఉండడానికి కారణం..?

టాలీవుడ్ లో మొదట హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాతో బర్నింగ్ స్టార్ గా పేరు సంపాదించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోల సినిమాలలో కూడా నటించారు. అయితే ఈ మధ్యకాలంలో సంపూర్ణేష్ బాబు నుండి కొత్త సినిమాలు ఏవి రావడం లేదు. అయితే సంపూర్ణేష్ బాబు మాత్రం కేవలం హీరో గాని నటించాలని కోరుకుంటున్నాడట .కానీ హీరోగా ఎక్కువ అవకాశాలు మాత్రం రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Netflix Indonesia and Netflix India are going 'bananas' over this Sampoornesh  Babu film
ఎక్కువగా ఇతర సినిమాలలో కమెడియన్ గా నటిస్తే ఎక్కువగా అవకాశాలు వస్తాయి కానీ సంపూర్ణేష్ బాబు ఆదిశగా ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది.వరుసగా మూడు నాలుగు సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఈ మధ్య కనిపించకుండా పోయారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. మొత్తానికి సంపూర్ణేష్ బాబు గత కొన్నారుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఆయన కెరియర్ కతమైనట్టే అంటూ పలువురు నేటిజన్లు తెలియజేస్తున్నారు.

మరి కొంతమంది సోషల్ మీడియాలో సంపూర్ణేష్ బాబు గురించి పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇంతకూ సంపూర్ణేష్ బాబు ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇతర హీరోల సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపలేదు. అనే విషయంపై సంపూర్ణేష్ బాబు క్లారిటీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. కొన్ని సినిమాలు కమిట్ అయినవి త్వరలోనే విడుదల అవుతాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తోని ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు సంపూర్ణేష్ బాబు లిస్టులో చాలానే ఉన్నాయి.

Share post:

Latest