వెంకటేష్, డైరెక్టర్‌ మధ్య పెద్ద గొడవ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

విక్టరీ వెంకటేష్, రానా కలిసి ‘రానా నాయుడు’ అనేది వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది అమెరికన్ సిరీస్ ‘రే డోనవన్‌’ రీమేక్‌గా వస్తోంది. ఈ సిరీస్‌లో వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. అయితే ట్రైలర్‌ని చూస్తే రానా నాయుడులో గ్రే షేడ్స్ ఉన్న ఇంటెన్స్, డార్క్ యాక్షన్ త్రిల్లర్ సిరీస్ అని అర్థం అవుతుంది. వెంకటేష్ తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. ఇటీవలే ది హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బోల్డ్ రోల్ గురించి వెంకటేష్ వివరించారు. తనకు ఆ సిరీస్‌లో ఆఫర్ వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారిని చాలా మందిని కనుకుంటే అందరూ కూడా యూత్ ఆ సిరీస్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ పాత్రకి ఓకే చెప్పానని అన్నారు. అంతేకాకుండా ఒక నటుడిగా ఎలాంటి సవాలు అయినా, రిస్క్ అయినా తీసుకునే ధైర్యం తనలో ఉన్నాయన్నాడు.

ఈ సిరీస్‌లో రానా, వెంకటేష్ ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటారు. వీరి రోల్స్ నిజ జీవితానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. అయితే దీనిలో వెంకటేష్ ఎప్పుడూ చేసే పాత్రలో కాకుండా చాలా కొత్తగా ట్రై చేస్తున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. అయితే రానా, వెంకీ ఆ హిందీ వెర్షన్ సిరీస్‌లో బూతులు పలికేటప్పుడు కొన్ని పదాలు చాలా సులభంగా చెప్పేవారట. కానీ అదే పాదాలను తెలుగులో మాత్రం చెప్పేటప్పుడు అసౌకర్యానికి గురయ్యారట. ఎందుకంటే మాతృభాషలో మాట్లాడే బూతులు ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వెంకటేష్ మాత్రం పబ్లిక్ లో తనకున్న మంచి పేరును దృష్టిలో పెట్టుకొని లాంగ్వేజ్ లో కాస్త మార్పులు చేర్పులు చేయాలని దర్శకుడితో రేంజ్ లో గొడవ పెట్టుకున్నాడట. అయితే ఇది సరదా గొడవేనట.

మళ్ళీ ఆ సిరీస్ వాళ్లు మిమల్ని సంప్రదిస్తారా అని అడిగిన ప్రశ్నకు వెంకటేష్ మాట్లాడుతూ ‘నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్ డ్రామా రానాతో చెయ్యడానికి రావొచ్చు’ అనేది చెప్తుండగానే రానా కల్పించుకుని ‘ కాదు మేం ఇద్దరం రానా నాయుడుకి సంబంధించి ఇంకా చాలా సీజన్లలో పని చేయొచ్చని చెప్పారు. రానా నాయుడు సిరీస్‌ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రిమియర్‌గా ప్రసారమవుతుంది.

Share post:

Latest