2023 : మోస్ట్ అవైటెడ్.. చిత్రాలు ఇవే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు కూడా తమ అభిమానుల హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ ట్రెండింగ్ లో నిరంతరము అభిమాన హీరోల గురించి తెగ వెతికేస్తున్నారు.. అలా ఈసారి బాగా పాపులర్ అయిన కొన్ని సినిమాల తొలి పది ర్యాంకుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ పుష్ప -2 చిత్రం బాలీవుడ్ లో నెంబర్ వన్ క్రేజీతో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ చాలా ఆత్రుతగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక తర్వాత అక్షయ్ కుమార్ నటించిన పరేష్ రావల్ -సంజయ్ దత్తుతో మల్టీ స్టార్టర్ క్యాటగిరిలో తెరకెక్కించిన హేరా షేరీ -3 పైన ఫోకస్ మళ్లీ పెరిగిపోయింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్-3 చిత్రం ట్రెండింగ్ లో ఉన్నది ఇప్పుడు టైగర్ మూడో స్థానంలో నిలిచింది. ఇందులో షారుక్ ఖాన్ అతిధి పాత్రలో కూడా నటిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ అట్లీ-షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ చిత్రం పైన క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ సినిమా నాలుగవ స్థానంలో ఉన్నది.

ఇక తర్వాత కార్తీక్ ఆర్య నటించిన భూల్ భూల్లయ్య -3 పైన కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సల్మాన్ ఖాన్ పూజ హెగ్డే నటిస్తున్న కీసిక భాయ్ కిసి కా జాన్ చిత్రం పైన కూడా మంచి బస్ ఏర్పడింది. ఇక ఇదే కాకుండా రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని.. గద్దర్-2 బడే మియాన్ చోటే మియాన్ వంటి చిత్రాలు కలవు కరోనా మహం వారి తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటున్న వేల పుష్ప -2 ఇక సంచలనాన్ని సృష్టించడం ఖాయమని బలంగా టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest