వైసీపీ రెడ్లు టీడీపీలోకి..గేమ్ ఛేంజ్!

ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి..ఊహించని విధంగా సమీకరాణాలు మారుతున్నాయి. అధికార వైసీపీ గ్రాఫ్ నిదానంగా డౌన్ అవుతుంటే..అటు టీడీపీ గ్రాఫ్ స్లోగా పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్ అని తెలుస్తోంది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలతో రిస్క్ పెరుగుతుంటే..మరో వైపు సొంత పార్టీ నేతలే వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నారు.

అది కూడా వైసీపీకి అండగా ఉండే రెడ్డి సామాజికవర్గం షాక్ ఇచ్చేలా ఉంది. అసలు వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలే ఎక్కువ..రెడ్డి వర్గం 70 శాతం పైనే వైసీపీకి సపోర్ట్ గా ఉంది. అయితే ఇదంతా గత ఎన్నికల్లోల్ కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. సొంత రెడ్డి వర్గమే షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..ఈ ఇద్దరు వైసీకి దూరం జరిగారు.

అదే సమయంలో ఇంకా పలువురు రెడ్డి నేతలు వైసీపీని వీడటానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. కడప జిల్లాలో డీఎల్ రవీంద్రా రెడ్డి, వరదరాజులు రెడ్డి, శివారెడ్డి..ఈ ముగ్గురు సైతం టి‌డి‌పిలోకి రావడానికి చూస్తున్నారు. అదే సమయంలో కడప జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం టి‌డి‌పిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇటు కర్నూలు జిల్లాలో సైతం కొందరు కీలక నేతలు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక నెల్లూరులో ఆనం-కోటంరెడ్డిలు మాత్రమే కాదు..ఇంకో రెడ్డి ఎమ్మెల్యే సైతం వైసీపీకి దూరమవుతారని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ రెడ్డి నేతలు టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారు.