కర్నూలు సిటీలో టీజీ భరత్‌కు వైసీపీ హెల్ప్!

తెలుగుదేశం పార్టీకి పెద్దగా బలం లేని జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి..ఈ జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లు గెలిచేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది…కొన్ని స్థానాల్లో వైసీపీ బలం తగ్గుతుంది. అదే సమయంలో కీలకమైన కర్నూలు సిటీలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి.

గత రెండు ఎన్నికల్లో కర్నూలు సిటీలో వైసీపీ గెలుస్తూ వస్తుంది. కాకపోతే స్వల్ప మెజారిటీల తేడాతోనే గెలిచి బయటపడింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఈ సారి ఇక్కడ వైసీపీకి షాక్ తగిలేలా ఉందని పలు సర్వేల్లో స్పష్టమవుతుంది. పైగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు పడని పరిస్తితి. 2014లో ఎస్వీ వైసీపీ నుంచి గెలిచి టి‌డి‌పిలోకి వెళ్లారు. ఇక 2019 ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. కానీ సీటు హఫీజ్‌కు దక్కింది.

హఫీజ్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే ఎస్వీ రాకతో ఇరు వర్గాల మద్య వైరా మొదలైంది. ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. దీని వల్ల వర్గ పోరు పెరిగింది. అటు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇక ఒకరికి సీటు ఇస్తే మరొక నేత ఓడించేలా వైసీపీ పరిస్తితి ఉంది. ఇవన్నీ టి‌డి‌పి ఇంచార్జ్ టి‌జి భారత్‌కు ప్లస్ అవుతున్నాయి. పైగా ఈయన ఇపుడు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఈ పరిస్తితులు ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో కర్నూలు సిటీలో భరత్ గెలుపుకు వైసీపీనే ప్లస్ అయ్యేలా ఉంది.

Share post:

Latest