నందమూరి వంశంలో పేర్లు ఇలా ఎందుకు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

 

సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రామారావు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేవుడిగా నిలిచాడు. అయితే చాలా రామారావు తన కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లు వెనుక కథ వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.

నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరికి వీరికి 8 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు. ఎన్టీఆర్ కి తెలుగు భాష, తెలుగు సంప్రదాయాలు, ఆచారాలు అంటే గౌరవం ఎక్కువగా. ఆ ఇష్టంతోనే ఎన్టీఆర్ తన కూతుర్లకు, కొడుకులకు, మనవళ్లు మనవరాళ్లకు సంప్రదాయమైనా పేర్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తన కొడుకుల పేర్లకు చివర్లో కృష్ణ అని వచ్చేలా పెట్టుకున్నారు. రామకృష్ణ, హరికృష్ణ, సాయి కృష్ణ, జయ కృష్ణ, బాలకృష్ణ, మోహన్ కృష్ణ లు ఇలా తన కొడుకులకు పేర్లు పెట్టారు. ఇక నలుగురి కూతుర్ల పేరు చివర్లో ఈశ్వరి అని వచ్చేలా నామకరణం చేసారు. లోకేశ్వరి, ఉమామహేశ్వారి, పురందేశ్వరి, భువనేశ్వరి వారి కూతుర్లు.

ఇక మనవళ్లు మనవరాళ్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ పెట్టిన పేర్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎన్టీఆర్ పెద్ద కొడుకు కుమార్తె పేరు కుదామిని, రెండవ కొడుకు కూతుర్ల పేర్లు శ్రీమంతుని, మనస్విని కాగా బాలకృష్ణ ఇద్దరు కూతుర్ల కి బ్రహ్మని, తేజశ్విని, ఇక చిన్న కుమారుడు కుమార్తె పేరు ఈషాని అని పేర్లు పెట్టారు. ఈ పేర్లు చూస్తుంటేనే ఎన్టీఆర్ కి తెలుగు భాష మీద ఎంత ఇష్టం, ప్రేమ ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతుంది.