అరుంధ‌తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న దుర‌దృష్ట‌వంతురాలు ఎవ‌రంటే…?

బబ్లీ బ్యూటీ అనుష్క పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సినిమా అరుంధతి. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆల్ టైం బెస్ట్ సినిమాగా అరుంధతికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పన సినిమా కూడా ఇదే.. అసలు ఈ విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుష్కను కాకుండా మమతా మోహన్ దాస్ ని అనుకున్నారట. ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో చేజేతులా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.

Arundhathi (Telugu) telugu | Sun NXT

అరుంధతి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 14 సంవత్సరాల అవుతున్న సందర్భంగా తొలిసారిగా ఈ షాకింగ్ విషయాన్ని మమతా మోహన్ దాస్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఆ సినిమా నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ తో కలిసి ఓ భారీ హారర్ జోనర్లో ఓల్డ్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని భావించారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్‌గా మమతా మోహన్ దాస్ ని ఎంపిక చేశారు.

This is the reason why I am not married yet, Mamata Mohandas revealed her plans for marriage - MixIndia

ముందు ఆమె ఈ సినిమాకు ఒప్పుకుని ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆ సినిమా చేయడానికి వెళ్లిపోయారు. ఆ సినిమాకి ఒకే చెప్పటంతో ఆ సమయంలో ఆమె మేనేజర్ ఆ ప్రొడ్యూసర్ గురించి చెడుగా చెప్పడంతో మేనేజర్ మాటలు నమ్మి ఆ సినిమాకు నో చెప్పానని ఆమె చెప్పకు వచ్చింది.

ప్రొడ్యూసర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆమె కోసం మూడు నెలల పాటు ఎదురుచూసినా ఆమె నో చెప్పటంతో ఫైనల్ గా ఈ సినిమాను అనుష్కతో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి. ఈ విధంగా మమతా మోహన్ దాస్ తన కెరీర్ టర్నింగ్ చేసే సినిమాను తన చేతులారా పోగొట్టుకుంది.

Share post:

Latest