అయ్యో, సమంత దీనికే భయపడితే ఎలా..??

 

సమంత నటించిన శాకుంతలం సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అన్ని బాగుంటే మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. రిలీజ్ టైం దగ్గర పడిన తర్వాత ఈ సినిమా నిర్మాతలు మళ్లీ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14కు వాయిదా వేశారు. అయితే ఈసారి సినిమా వాయిదా పడడానికి ప్రధాన కారణం హిందీ చిత్రం షెజాదా.

నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమాని 17కి వాయిదా వేసారు. భూల్ భూలయిమా -2 సినిమా సూపర్ హిట్ అయిన తరువాత కార్తీక్ ఆర్యన్ నటించిన సినిమా ఇది. కాబట్టి అక్కడ థియేటర్స్ ఖాళీ ఉండవు అనే ఉద్దేశ్యంతో, అంతేకాకుండా హిందీ ప్రేక్షకులకు షెజాద్ సినిమా మైకంలో పడి శాకుంతలం సినిమాని పట్టించుకోరని శాకుంతలం మూవీ టీమ్ ఆ సినిమాని వాయిదా వేసారు.

కానీ షెజాద్ సినిమా మాత్రం విడుదల అయిన ప్రతిచోటా పరాజయం పాలయింది. తెలుగులో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అలా వైకుంఠపురములో సినిమాకి రీమేక్ కి హిందీలో వచ్చిన షెజాద్ సినిమా అక్కడి ప్రేక్షకులను పెద్దగా తట్టుకోలేకపోయింది. అమెరికాలో ఈ సినిమాకు ప్రీమియర్ సేల్స్ మొదలు పెడితే కనీసం 500 టికెట్స్ కూడా అమ్ముడు పోలేదు. దీనిబట్టి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.

శాకుంతలం మూవీ టీమ్, సమంత భయపడకుండా ఒకడుగు ముందేసి ఉంటే మంచి విజయం అందుకునేది. అయితే ప్రేక్షకులు మాత్రం శాకుంతలం సినిమా త్వరగా రిలీజ్ కావాలని వేచి చూస్తున్నారు. అయితే చిన్న హీరో నటించిన బాలీవుడ్ సినిమాకి భయపడి సమంత తన సినిమాని వాయిదా వేసుకుంది. దాంతో దీనికే భయపడితే ఎలా అంటూ వారు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest