రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన యంగ్ హీరో విశ్వ‌క్ సేన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గురించి పరిచయాలు అవసరం లేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిల్లో ఎక్కువ హిట్లు ఉండడంతో విశ్వక్ సేన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో `దాస్ కా దమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌ట్టాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇక‌పోతే విశ్వ‌క్ సేన్ ఇటీవ‌ల కాలంలో త‌న రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేశాడు. వ‌రుస హిట్లు మ‌రియు త‌న సినిమాల‌కు బిజినెస్ కూడా బాగా జ‌రుగుతుండ‌డంతో.. విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 4.5 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ట‌. ఇక విశ్వ‌క్ సేన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

Share post:

Latest