న‌య‌న‌తార‌కు బిగ్ షాకిచ్చిన విఘ్నేష్‌.. పిల్ల‌ల కోసం ఆ ప‌ని చేస్తుందా?

లేడీ సూపర్ స్టార్ నయనతార గ‌త ఏడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్ల‌పాటు ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్ గా వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి అయిన‌ నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో పండంటి మగ కవలలకు జన్మనిచ్చారు. వీరి సరోగసి చాలా పెద్ద వివాదం అయింది. అయితే లీగ‌ల్‌గానే వివాదానికి న‌య‌న్ దంపుతులు ముగింపు ప‌లికారు.

ఇకపోతే తాజాగా నయనతారకు భర్త విఘ్నేష్ శివ‌న్ బిగ్ షాక్ ఇచ్చాడట. పిల్లల కోసం కొన్నాళ్లు సినిమాలు మానేయాలంటూ చెప్పాడట. షూటింగ్స్ కారణంగా ఎవరికి వారు బిజీ అవ్వ‌డం వ‌ల్ల‌ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఏమాత్రం సమయం దొరకడం లేదట. ఈ నేపథ్యంలోనే ఇద్దరిలో ఒకరైన పిల్లల్ని చూసుకుంటే మంచిదని విఘ్నేష్ భావించాడట. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇవ్వ‌మ‌ని చెప్పాడట.

ఇక భ‌ర్త‌ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందని భావించిన నయనతార.. కొన్నాళ్లు సినిమాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం మానేసిందట. ప్రస్తుతం బాలీవుడ్ లో జవాన్ అనే మూవీ చేస్తోంది. ఈ మూవీ పూర్తయిన వెంటనే తన పూర్తి సమయాన్ని పిల్లలకే కేటాయించాలని నయన్ డిసైడ్ అయినట్టు నెట్టింట జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే నయనతార ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలడం ఖాయమని అంటున్నారు.

Share post:

Latest