మంచి పేరునంత చెడగొట్టుకుంటున్న వెంకటేష్.. ఇలాంటి దిక్కుమాలినవి అవసరమా??

కరణ్ అన్షుమన్, సూపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రామా నాయుడు అనే వెబ్‌సిరీస్ తో విక్టరీ వెంకటేష్ మొదటిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అరంగేట్రం చేయనున్నాడు. మార్చి 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని అమెరికన్ హై డ్రామా “రే డోనోవన్” కి అధికారిక రీమేక్.

రానా నాయుడు సిరీస్ ట్రైలర్ ఇటీవకే విడుదల అయింది. ఈ సిరీస్ నటించిన వెంకటేష్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు వెంకటేష్ నటించిన సినిమాలు అన్ని ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకూ చూసేలా ఉంటాయి వెంకీ సినిమాలు. అయితే ఈ వెబ్ సిరీస్ లో మాత్రం వెంకటేష్ భాష చాలా అసభ్యకరంగా ఉంది, దాంతో చాలామంది సిరీస్ ని చూడడానికి ఇష్టపడటం లేదు.

అంతేకాకుండా రానా నాయుడు సిరీస్ లో వెంకటేష్ హెయిర్ స్టైల్ అతనికి సూట్ అవలేదని, మంచి పేరు చెడగొట్టుకోవడం అవసరమా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పాత్రలు చెయ్యడం వల్ల ప్రేక్షకులో ఆయనకి ఉన్న ఇమేజ్ తగ్గుతుంది అని మరికొంతమంది అంటున్నారు. నటులు అన్న తరువాత రకరకాల పాత్రలో నటించాల్సి వస్తుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నటీనటులు కొన్ని సరికొత్త పాత్రలలో నటించాల్సి వస్తుంది, ఆ అవకాశం సినిమాలో రాదు అని ఇంకొంతమంది అంటున్నారు.

ఏది ఏమైనా ఒక ఫ్యామిలీ హీరో ఇలా  చాలా పాల్ గారి గా మాట్లాడటం ఫ్యాన్స్ కి కూడా కాస్త షాకింగ్ గానే ఉంది. ఓటీటీ అనగానే నూడిటీ, వల్గారిటీ మాత్రమే ఉండేలా తీయాల్సిన అవసరం లేదు. మంచి కథలతో మనసుని హత్తుకునేలా కూడా తీయవచ్చు. అలాంటి వెబ్ సిరీస్‌లలో మాత్రమే వెంకటేష్ నటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest