జనసేనలోకి వంగవీటి..పాత కథే..కొత్తగా!

ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు..వంగంవీటి రంగా..కాపు సామాజికవర్గం కోసం పోరాడిన రంగా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లో ఉంటూనే..కాపు వర్గానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఈయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టి‌డి‌పిలో చేరిన రాధా..ఎన్నికల్లో పోటీ చేయకుండా టి‌డి‌పికి మద్ధతుగా నిలిచారు. ఎన్నికల తర్వాత టి‌డి‌పి అధికారం కోల్పోవడంతో..రాధా కాస్త రాజకీయాలకు దూరం అయ్యారు.

కాపు వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. టి‌డి‌పిలో యాక్టివ్ గా ఉండటం లేదు..కానీ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. అటు టి‌డి‌పి నేతలపై దాడులు జరిగితే పరామర్శిస్తున్నారు. అంతే తప్ప రాజకీయంగా మాత్రం యాక్టివ్ గా ఉండటం లేదు. అప్పుడు రంగా విగ్రవిష్కరణల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధా కలుస్తున్నారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళుతున్నారని ప్రచారం వస్తుంది. అలాగే జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ని కలిస్తే జనసేనలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం వస్తుంది.

ఇలా ఆయన పై పార్టీ మారతారని ప్రచారం వస్తూనే ఉంది. కానీ ఈ సారి కూడా ఆయన పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది..అంతే పాత కథని కొత్తగా చెబుతున్నట్లు అనిపిస్తుంది..ఆయన జనసేనలోకి వెళ్తారని, అలాగే విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీ చేస్తారని, టి‌డి‌పి-జనసేన పొత్తులో భాగంగా సెంట్రల్ సీటు జనసేనకు ఇస్తారని, అక్కడ రాధా పోటీ చేస్తారని అంటున్నారు.

అసలు పొత్తు ఉంటే రాధాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు. అదే టి‌డి‌పి నుంచి సెంట్రల్ లో పోటీ చేయవచ్చు. అక్కడ ఉన్న టి‌డి‌పి నేత బోండా ఉమాకు వేరే చోట సీటు ఇచ్చి రాధాని దింపవచ్చు. కాబట్టి రాధా పార్టీ మారడం అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. జనసేనలోకి వెళుతున్నారనేది కేవలం ప్రచారం మాత్రమే.

Share post:

Latest