మా పిల్లలను అలానే పెంచుతాం.. నెగ‌టివ్ కామెంట్స్‌పై ఇచ్చిప‌డేసిన ఉపాస‌న‌!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ ఉపాస‌న గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్వ‌ర‌లోనే ఉపాస‌న త‌ల్లి కాబోతోంది. పెళ్లి అయిన ప‌దేళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మెద‌ట చిరంజీవి వెల్ల‌డించాడు. మ‌రి కొద్ది నెల‌ల్లోనే రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పేరెంట్స్ గా ప్ర‌మోట్ కానున్నారు.

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే ఉపాస‌న తాజాగా నెగ‌టివ్ కామెంట్స్ పై త‌న‌దైన శైలిలో ఇచ్చిప‌డేసింది. తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని చాలా మంది అంటున్నారని.. కానీ, తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఉపాసన కొణిదెల పేర్కొంది. అలాగే తాను కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని తెలిపింది.

ఇక చరణ్, తాను తమ పిల్లలను కూడా అలాగే పెంచుతామని ఉపాస‌న వివ‌రించింది. దయచేసి త‌న‌ గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చెయ్యొద్దు అని ఉపాస‌న కోరింది. దీంతో ఉపాస‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్సీ 15`లో న‌టిస్తున్నాడు. కియారా ఇందులో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ అనంత‌రం బుచ్చిబాబుతో చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు.

Share post:

Latest