మెగా కోడ‌లు ఉపాస‌న‌కు సీమంతం వేడుక‌.. వైర‌ల్ గా మారిన పిక్స్‌!

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవల గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన ప‌దేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయం ప‌ట్ల‌ అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అశేష అభిమాన వర్గం మొత్తం ఎంతో సంతోషంతో ఉన్నారు.

అయితే మ‌రికొద్ది రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందబోతున్న రామ్‌చరణ్‌ దంపతులకు చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఉపాసన ఫ్రెండ్స్‌. చెర్రీ ఇంటికి వెళ్లి ఉపాసనకు చిన్నపాటి సీమంతం నిర్వహించారు. ఉపాస‌నకు గాసులు, పూల దండ వేసి పలు బహమతులు అందించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ను ఉపాస‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.

`బేబీ కమింగ్‌ సూన్‌` అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా వ‌చ్చింది.

Share post:

Latest