`ఉగ్రం` టీజర్ వచ్చేసింది.. అల్లరోడు భ‌య‌పెట్టేశాడుగా!

`నాంది` సినిమాతో త‌న‌లోని మ‌రో కోణాన్ని చూపించి మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. మ‌రో వైవిద్య‌మైన చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే `ఉగ్రం`. నాంది సినిమాను తెర‌కెక్కిన విజ‌య్ క‌న‌క‌మేడ‌లనే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీతో మిర్నా అనే హీరోయిన్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. త‌ర్వలోనే ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఉగ్రం టీజ‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. టైటిల్ కు త‌గ్గ‌ట్లే టీజ‌ర్ కూడా వైల్డ్ గా సాగింది. యాంగ్రీ పోలీస్ అఫీస‌ర్ పాత్రలో అల్ల‌రోడు త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి భ‌య‌పెట్టేశాడు.

ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యొక్క అంద‌మైన ఫ్యామిలీని విలన్స్ డిస్టర్బ్ చేస్తే అతడి రియాక్షన్ ఎలా ఉంటుందనేదే ఉగ్రం మూవీగా టీజ‌ర్ బ‌ట్టీ స్ప‌ష్ట‌మైంది. `నాది కాని రోజు కూడా నేను ఇలాగా నిలబడతా` అంటూ అల్ల‌రి న‌రేష్ చెప్పిన డైలాగ్, ఫైట్స్ టీజ‌ర్ లో హైలెట్‌గా నిలిచాయి. మొత్తానికి ఆధ్యంతం ఆక‌ట్టుకున్న ఈ టీజ‌ర్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Share post:

Latest