ఉదయగిరి టీడీపీలో ట్విస్ట్..బొల్లినేనికి ఛాన్స్ ఉందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాదు అనే చెప్పాలి. అసలు జిల్లాలో టి‌డి‌పికి పట్టు తక్కువ. రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉండటంతో జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ ఉంటుంది. అలా వైసీపీ హవా ఉన్న నియోజకవర్గాల్లో ఉదయగిరి కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. అసలు ఇక్కడ టి‌డి‌పి గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే..1999, 2014 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది.

ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2012 ఉపఎన్నిక, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. 2004, 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే ప్రస్తుతం మేకపాటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఆయనకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. సొంత పార్టీ లోనే ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే వైసీపీపై ఉన్న వ్యతిరేకతని ఉపయోగించుకోవడంలో టి‌డి‌పి విఫలమవుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బొల్లినేని వెంకట రామారావు అంత యాక్టివ్ గా పనిచేయలేదు. దీని వల్ల టి‌డి‌పికి ప్లస్ కనిపించలేదు.

కానీ ఇటీవల ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. ఎందుకంటే ఉదయగిరి సీటు కోసం ఇంకా పలువురు నేతలు ట్రై చేస్తున్నారు. ఓ యువనేత సైతం ఈ సీటు కోసం కాచుకుని కూర్చున్నారట. దీంతో బొల్లినేని యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు..ఉదయగిరి సీటు బొల్లినేనికే ఇస్తారా? లేక వేరే నేతకు ఇచ్చి ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి.

Share post:

Latest