ఉద‌య్-ఆర్తీ అగ‌ర్వాల్ క‌ల‌వ‌డంలో ఇంత దుర‌దృష్టం ఉందా…!

టాలీవుడ్ లో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ దివంగత యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చీకటి విషాదంతాలు ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు చిన్నవయసులోనే అకాల మరణం పాలవటం సినిమా వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. దాదాపు ఒకే టైంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు నాలుగైదు సంవత్సరాల వ్యవధిలో ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్లు అయ్యారు. చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ డూపర్ హిట్‌ల‌తో అప్పట్లో స్టార్ హీరోల‌కి ముచ్చెమటలు పట్టించాడు.

ఇటు వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆర్తి అగర్వాల్ నాలుగు సంవత్సరాలలో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది..వరుసగా అటు సీనియర్ హీరోలైన‌ బాలయ్య, నాగార్జున, వెంకటేష్, చిరంజీవిల‌తో పాటు క్రేజీ హీరోలైన‌ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ పక్కన కూడా నటించింది. అస‌లు అప్ప‌ట్లో ఆర్తీ అందానికి తెలుగు జ‌నాలు ఫిదా అయిపోయారు.

Gemini Movies ar Twitter: "Watch love entertainer "Nee Sneham" today @ 4.00  pm. Cast: Uday Kiran, Aarthi Agarwal, Jatin, K Viswanath, Kaushal, Ali  http://t.co/1iUYPssB" / Twitter

సినిమా రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి… నిజ జీవితంలో తక్కువ వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఇద్దరూ మంచి స్నేహితులు. ఉదయ్ – ఆర్తి కాంబినేషన్లో పరుచూరి మురళి దర్శకత్వంలో నీ స్నేహం సినిమా వచ్చింది. అప్పట్లో వీరిద్దరూ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో పాటు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నీ స్నేహం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ని క్యాన్సల్ చేసుకున్న స్టార్స్ వీరే.! OK  Telugu

ఇద్దరి స్నేహితుల స్నేహ అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్పీ పట్నాయక్ ఇచ్చిన‌ స్వరాలు ఈ సినిమా హిట్ అవ‌డంలో కీలకపాత్ర పోషించాయి. సీనియర్ నటులు కే విశ్వనాధ్, గిరిబాబు, శివాజీ రాజా, పరుచూరి వెంకటేశ్వరరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే ఆర్తి-ఉదయ్ మంచి స్నేహితులుగా ద‌గ్గ‌ర‌య్యారు. అయితే అప్పటికే ఆర్తికి మరో యువ‌ హీరో తరుణ్ తో ఎఫైర్ ఉందన్న వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్త‌రు హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా ఉదయ్-ఆర్తి మంచి స్నేహితులగానే ఉన్నారు. ఎవ‌రు ఉహించ‌ని విధంగా ఆ తర్వాత ఇద్దరికీ త‌మ‌ కెరీర్ పరంగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అవడంతో పాటు హిట్ సినిమాలు ప‌డ‌ల్లేదు. అటు ఉదయ్ కిరణ్ కు చిరంజీవి కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సిల్ అవ్వటం..ఇటు ఆర్తి అగర్వాల్ తరుణ్‌తో బ్రేకప్ అవడంతో ఈ ఇద్దరికి పెద్ద దెబ్బ పడిపోయింది. ఇక చివ‌ర‌కు ఇద్ద‌రు చిన్న‌ వ‌య‌స్సులోనే మృతిచెంద‌డం అంద‌రిని మ‌రింత బాధపెట్టింది.

Share post:

Latest