అంద‌రి ముందు ఆ హీరోయిన్ కు `ఐ లవ్ యు` చెప్పిన‌ త్రివిక్ర‌మ్‌..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంద‌రి ముందు ఓ హీరోయిన్ కు ఐ లవ్ యు అని చెప్పేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. త్రివిక్ర‌మ్ సతీమ‌ణి సాయిసౌజన్య ప్ర‌ముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో క‌లిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై `సార్(త‌మిళంలో వాతి)` అనే మూవీని నిర్మించింది.

కోలీవుడ్ స్టార్ ధ‌నుస్ తెలుగులో తొలిసారి నేరుగా చేసిన చిత్ర‌మిది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ లో బుధ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు త్రివిక్ర‌మ్ గెస్ట్ గా వ‌చ్చారు.

త‌న స్పీచ్ తో సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ సంయుక్తపై ప్రశంసల వర్షం కురిపించిన గురూజీ అందరి ముందే ఆమెకు ఐ లవ్ యు చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో అది కాదు చెప్పనివ్వండయ్య బాబు అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ఆపై నువ్వు(సంయుక్త‌) అడిగినట్టు ఆ భార్య‌కు చెపుతానన్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

Share post:

Latest