SSMB28.. షూటింగ్ మానేసి సెట్ లో క్రికెట్ ఆడుతున్న త్రివిక్ర‌మ్‌.. వీడియో వైర‌ల్‌!

అల వైకుంఠపురంలో వంటి సూపర్ డూపర్ హిట్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. అతడు ఖ‌లేజా సినిమాల‌ తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో త్రివిక్రమ్ బ్రేక్ టైం లో టీం మెంబ‌ర్స్ తో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ క‌నిపించారు. ప్రస్తుతం ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియో పై నెటిజ‌న్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే షూటింగ్ ఆపేసి సెట్లో క్రికెట్ ఆడుతున్నావా అంటూ త్రివిక్రమ్ పై సరదాగా సెటైర్లు పేలుస్తున్నారు.

https://twitter.com/SSMBHERE/status/1620782825317466112?s=20&t=thnpf33nv3flxaTQme5NlQ