పూజా హెగ్డేకు ల‌గ్జ‌రీ కారు కొన్న త్రివిక్ర‌మ్‌.. అస‌లు క‌థ తెలిస్తే షాకైపోతారు!

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. గ‌త రెండు రోజుల నుంచి త్రివిక్ర‌మ్, పూజా హెగ్డేల‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. తాజాగా బుట్ట‌బొమ్మ‌కు త్రివిక్ర‌మ్ పర్సనల్ గా రెండు కోట్ల రూపాయిలు విలువ చేసే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చార‌ట‌. ప్ర‌స్తుతం ఆ కారులోనే పూజా హెగ్డే షూటింగ్ కు వస్తోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కొంద‌రు ప‌ని గ‌ట్టుకుని మ‌రీ త్రివిక్ర‌మ్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

కానీ, అస‌లు క‌థ వేరే ఉంద‌ట‌. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమాలకు సంబంధించి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పార్ట్నర్ షిప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు బ్యానర్లలో త్రివిక్రమ్‌ పెట్టుబడులు ఉన్నాయంటారు. ఇక ఈ ప్రొడక్షన్స్‌లో చేసే సినిమాలకు సంబంధించి హీరోయిన్లను సెట్స్‌కి తీసుకురావడానికి, మళ్లీ తీసుకెళ్లి హోటల్స్‌లో దింపడానికి.. అద్దె కార్లు అయితే భారీగా ఖర్చు అవుతుంద‌ట‌. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ తరపున రూ. 2 కోట్లు పెట్టి ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేశారట‌. అంతేగానీ పూజా హెగ్డేకు త్రివిక్ర‌మ్ ఎలాంగి కారు గిఫ్ట్ గా ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. కావాల‌నే త్రివిక్ర‌మ్ పై కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్నారు.

Share post:

Latest