ట్రైలర్: సరికొత్త కథ అంశంతో వస్తున్న ధనుష్..!!

ధనుష్ తాజాగా నటించిన చిత్రం సార్. ఈ సినిమా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు ధనుష్ చిత్ర బృందం నిన్నటి రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ కూడా పాల్గొన్నారు.

Sir Movie Cast – Latest News Information updated on February 08, 2023 |  Articles & Updates on Sir Movie Cast | Photos & Videos | LatestLY

విద్యా విధానంలో ఉన్న లోపాలని ఎత్తిచూపుతూ ఈ సినిమా మూవీని తెరకెక్కించినట్టుగా ఈ ట్రైలర్లో చూపించారు. ఇక అంతే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు.. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఎవరు సార్ ఆయన.. అంటూ మొదలవుతుంది ఈ ట్రైలర్.. ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది నా ప్రాఫిటల్ సర్వీస్ త్రిపాఠి ఇన్స్టిట్యూషన్ తరపున కొన్ని గవర్నమెంట్ కాలేజీలను దత్తకు తీసుకున్న అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపించాలనుకుంటున్నాము.. మీరు కాలేజీకి ఏదో మంచి చేస్తారని పిస్తోంది అందుకే వెల్కమ్ టు గెదర్ కాలేజ్ అంటూ సాగే సంభాషణ మొదలవుతుంది.

ఈ ట్రైలర్ లో సముద్రఖని నటన కూడా హైలెట్గా నిలిచేలా ఉంది. అలాగే సాయికుమార్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. హైపర్ ఆది కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వాటితోపాటు ట్రైలర్ తో కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. తనికెళ్ల భరణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Share post:

Latest