నాగబాబు భార్య పద్మజా గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్లో మెగాస్టార్ తమ్ముడుగా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా నిర్మాతగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే నిర్మాతగా పలు ఆర్థిక నష్టాలను కూడా చవిచూశారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో ఇక ఆ వైపుగా సిని నిర్మాణం వైపు అడుగు వేయలేదు. నాగబాబు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Nagababu's wife confirms Allu Arjun, Varun Tej campaigning for Pawan  Kalyan's Jana Sena - IBTimes India

రుద్రవీణ సినిమా షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజాను బంధువుల పెళ్ళిలో చూసి ఆ అమ్మాయి ఎవరని అక్కడున్న కొందరిని అడిగిందట. పద్మజ పెళ్లి కొడుకు తరఫున అమ్మాయి అయితే అంజనాదేవి పెళ్లికూతురు తరపున పెళ్ళికి వచ్చిందట. పద్మజ బంధువుల అమ్మాయి అని తెలిసి అంజనదేవి కాస్త ఆనంద పడిందట. ముఖ్యంగా ఆమెను చూడడానికి సాంప్రదాయమైన కుటుంబంలో పెరిగినట్టుగా కనిపించిందని తన ఇంటి కోడలైతే బాగుంటుందని అనుకుందట అంజనాదేవి.

ముఖ్యంగా విషయం ఏమిటంటే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని అట. అలా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆల్బమ్ చూపించేదట. అలాగే వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ను చూపించడంతో అంజనదేవి చాలా ముచ్చట పడిపోయిందట. తన అభిమాని అయిన నాగబాబు భార్యగా రావడం చిరుకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని తెలియజేసింది అంజనాదేవి. అప్పటినుంచి ఇప్పటివరకు పద్మజ వివాదాల జోలికి అసలు వెళ్లడం లేదు. భర్త పిల్లల కోసమే పాటు పడింది. ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సహాయంగా ఉంటోంది. అప్పుల్లో ఉన్న నాగబాబుకు తన నగలు అమ్మి మరి అప్పు తీర్చమని సలహా ఇచ్చిందట. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలిసి బాధపడి తన అప్పులు సగభాగాన్ని తీర్చినట్లుగా సమాచారం ఆ వెంటనే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి అప్పులను తీర్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలను నటిస్తున్నారు వరుణ్ తేజ్.

Share post:

Latest