ఫస్ట్ వీక్‌లో బీభత్సమైన కలెక్షన్లను రాబట్టిన మూవీస్ ఇవే…!!

 

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా హంగామా నడుస్తుంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా అన్ని భాషా ప్రేక్షకులకు మెప్పించే అవకాశం ఉంటుంది. అలాగే వారి మార్కెట్ కూడా పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ.

నిజానికి స్టార్ట్ హీరోల సినిమాలు రెండు మూడు రోజులోనే వందల కోట్ల అందుకుంటున్నాయి. అయితే కేవలం ఒక్క రోజులోనే వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కూడా వున్నాయి. బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్ లాంటి సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేసాయి. ఇక బాలీవుడ్‌లో ఫస్ట్ వీక్‌లో బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టిన సినిమాలా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు ఉన్నాయి. అయితే వాటిని వెనక్కి నెట్టేసి షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా ముందు వరుసలోకి వచ్చేసింది. కరోనా తరువాత షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా దాదాపు 100 కోట్లకి పైగా కలెక్టన్లు రాబట్టింది. ఈ సినిమా కంటే ముందు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ అవేమీ ప్రేక్షకులకు మెప్పించలేకపోయాయి.

ఇక స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన పఠాన్ సినిమా ఆడియన్స్ అంచనాలు అందుకుంది. దాంతో ఈ సినిమా వచ్చిన రెండు వారాలోనే దాదాపు 800 కోట్ల రూపాయల వసూలు చేసి రికార్డు సాధించింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రూ.1,000 కోట్లు సంపాదించిన సినిమా గా పేరు తెచ్చుకుంది. ఇలా మంచి కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో 351 కోట్ల తో పఠాన్ సినిమా ముందు వరుసలో ఉండగా, 268 కోట్లతో కేజీఎఫ్ 2 రెండవ స్థానంలో, 247 కోట్లతో బాహుబలి 2 మూడవ స్థానంలో, 229 కోట్ల రూపాయలతో సల్మాన్ ఖాన్ సినిమా నాలుగవ స్థానాలలో ఉన్నాయి.