సరిపోయింది.. అటు బాలయ్య, ఇటు గోపీచంద్ కలిసి శ్రుతిని బలి చేశారుగా!

బాలకృష్ణ సినిమా విడుదల అయ్యిందంటే అభిమానులే కాదు ట్రోలర్లు కూడా పండగ చేసుకుంటారు. ప్రత్యేకించి ఓటీటీ ప్రేక్షకులు బాలయ్య బాబు సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసేస్తూ అందులోని ఓవరాక్షన్ సన్నివేశాలు లేదా డ్యాన్స్‌లను కనుగొని ట్రోల్ చేస్తుంటారు. అలాగే సినిమాలోని ఏ సన్నివేశాలు అయితే తక్కువ సమయంలో వైరల్ అవుతాయో ఆ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.

కాగా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ రీసెంట్ గా ఓటీటీ వేదికగా విడుదలైంది. దాంతో ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బాగా యాక్టివ్ అయిపోయిన ట్రోలర్స్‌ ఈసారి ట్రోల్స్ బాలయ్యపై కాకుండా శృతిహాసన్‌పై మొదలుపెట్టారు. సినిమా మొదటి 20 నిమిషాల్లో శ్రుతిహాసన్ చేసిన సన్నివేశాలు సెన్స్‌లెస్ ఉన్నాయని, యాక్టింగ్‌ ఓవర్ అయిందని వారు ట్రోల్స్ మొదలెట్టారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ సన్నివేశాలను అలా ఎలా క్రియేట్ చేశాడో తెలియక చాలామంది బుర్ర కొట్టుకుంటున్నారు. వీటిలో శృతి నటనను మరింత ఘోరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఆ విధంగా బాలయ్య, గోపీచంద్‌ల నడుమ శ్రుతి బలైపోయింది.

ఇక ఈ సినిమాలో యంగ్ బాలయ్య పాత్రను చూసి బాలకృష్ణను కూడా ట్రోల్ చేస్తున్నారు. తండ్రి కంటే కొడుకు ముసలోడిలా కనిపిస్తున్నాడని పలువురు అంటున్నారు. అయితే పాత క్యారెక్టర్‌లో బాలయ్య నటనతో పాటు థమన్ అద్భుతమైన బిజీఎమ్ హైలైట్ అవుతోంది. ఏది ఏమైనా బాలయ్య సినిమా వస్తే ఎక్కువగా బాల ఏ ట్రోలింగ్‌కి గురవుతుంటాడు ఈసారి మాత్రం హీరోయిన్ ట్రోలింగ్‌ బారినపడి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Share post:

Latest